Sunday, May 19, 2024

Shame: సొంత బిడ్డ‌పై తండ్రి లైంగిక వేధింపులు.. సాక్ష్యం కోసం వీడియో తీసిన కుమార్తె

కన్న తండ్రే కిరాత‌కుడిగామారాడు. సొంత బిడ్డ‌మీద‌నే లైంగిక‌ వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. అయితే.. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియ‌క ఆ అమ్మాయి విల‌విల్లాడింది. ఓరోజు త‌ల్లికి ఈ విష‌యం చెప్పి క‌న్నీరుపెట్టుకుంది. అయితే ఆ త‌ల్లి ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకోక‌పోగా.. బిడ్డ‌నే అనుమానించింది. త‌నే రెచ్చ‌గొడుతున్న‌ట్టు తిట్టిపోసింది. అయితే.. త‌న తండ్రే ఇట్లాంటి ఘాతుకానికి పాల్ప‌డుతున్నాడంటే త‌ల్లే కాదు.. మ‌రెవ‌రూ త‌న మాట న‌మ్మ‌రు అని డిసైడ్ అయ్యింది ఆ అమ్మాయి.

త‌న త‌ల్లి ఈ విష‌యమ్మీద భర్తను ఏమీ అనలేదు సరికదా కూతురే తప్పు చేసిందని, తండ్రిని రెచ్చగొడుతోందని ఆమె తిట్టిపోసింది. దీంతో మ‌రింత అవ‌మానానికి గురైన అమ్మాయి ఎలాగైనా తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. దానికి కూడా తన‌కు తానే ఎరగా మారింది. తండ్రి వచ్చి మరోసారి తనను లైంగికంగా వేధిస్తున్నప్పుడు రహస్యంగా వీడియో తీసింది. ఆ వీడియో తీసుకొని పోలీసులను ఆశ్రయించింది.

ఆ వీడియో చూసిన పోలీసులు కీచ‌క తండ్రిపై కేసు నమోదు చేశారు. ఆ వీడియోలో ఉన్న దాని కంటే దారుణంగా తనపై రోజూ లైంగిక వేధింపులు జరిగేవని ఆ అమ్మాయి పోలీసుల ముందు వాపోయింది. ఈ ఘటన బిహార్‌లోని రోస్రా ప్రాంతంలో వెలుగు చూసింది. దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నామని, ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement