Sunday, May 5, 2024

రాష్ట్ర‌ప‌తి విప‌క్ష‌ అభ్య‌ర్థి పోటీ నుండి త‌ప్పుకున్న ఫారూక్ అబ్దుల్లా

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు విప‌క్ష అభ్య‌ర్థి పోటీ నుండి మ‌ర్యాద‌పూర్వ‌కంగా త‌ప్పుకుంటున్న‌ట్లు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. విప‌క్షాల సంయుక్త అభ్య‌ర్థి జాబితా నుంచి త‌న పేరును తొల‌గిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం జ‌మ్మూక‌శ్మీర్ చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఉంద‌ని, ఇలాంటి స‌మ‌యంలో తాను అక్క‌డే ఉండ‌డం ముఖ్య‌మ‌ని ఫారూక్ తెలిపారు. త‌న‌కు మునుముందు యాక్టివ్ రాజ‌కీయాలు ఎంతో ఉన్నాయ‌ని, జ‌మ్మూక‌శ్మీర్ కోసం మ‌రింత పాజిటివ్ సేవ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న పేరును ప్ర‌తిపాదించిన మ‌మ‌తా బెన‌ర్జీకి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సీనియ‌ర్ నేత‌లకు కూడా ఆయ‌న థ్యాంక్స్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement