Friday, April 26, 2024

ఇజ్రాయిల్ లో ఆర్ ఆర్ ఆర్ హ‌వా – కొమురం భీం ఎన్టీఆర్ ని కొనియాడుతూ క‌థ‌నం

ఆర్ ఆర్ ఆర్ హ‌వా ఇప్ప‌ట్లో ఆగేలా లేదు..ప‌లు దేశాల్లో త‌న స‌త్తాని చాటుతోంది ఈ చిత్రం..కాగా ఈ మూవీని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి రూపొందించారు… ఇజ్రాయిల్ కు చెందిన ఒక వార్త పత్రికలో ఆర్ ఆర్ ఆర్ లోని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ప్రముఖంగా కథనం వచ్చింది. ఇజ్రాయిల్ కు చెందిన సదరు వార్త పత్రిక లో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటన .. ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ గురించి ప్రధానంగా చర్చించారు. ఏదో చిన్న కాలమ్ మ్యాటర్ కాకుండా చాలా పెద్ద కథనంనే ఈ సినిమా గురించి ..ఎన్టీఆర్ గురించి రాయడం విశేషం.

ఈ సినిమాలోని ఎన్టీఆర్ రెండు ఫోటోలను కూడా సదరు వార్తా పత్రికలో వేశారు. ఈ కథనం పూర్తిగా ఎన్టీఆర్ పాత్ర చుట్టు.. ఆయన నటన చుట్టు తిరిగింది. దాంతో నందమూరి అభిమానులు ఈ పేపర్ కట్టింగ్ ను సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇజ్రాయిల్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ను భారీ ఎత్తున జనాలు చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగులో లేదా సౌత్ ఇండియాలో లేదా ఇండియా వరకే పరిమితం కాకుండా పలు దేశాల్లో సత్తా చాటుతుంద‌ని మరోసారి నిరూపించారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement