Saturday, May 4, 2024

ఎఫ్3 షూట్ కంప్లీట్ – ఇక న‌వ్వులే న‌వ్వుల‌ట‌

ఎఫ్2కి సీక్వెల్ గా ..ఎఫ్3 తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అనీల్ రావిపూడి రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో విక్ట‌రీ వెంక‌టేష్, యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. వీరికి జంట‌గా త‌మ‌న్నా, మెహ్రీన్ ఫిర్జాది న‌టిస్తున్నారు. ఈసారి వెంక‌టేష్, వరుణ్ తేజ్ ల కామెడీకి తోడు యాక్ట‌ర్ సునీల్ కూడా తోడ‌య్యాడు. ఎఫ్2 తరహాలోనే ఎఫ్3 కూడా నవ్వుల పండుగేనని చిత్రబృందం హామీ ఇస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ కామెడీ ఎంటర్టయినర్ మూవీని టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ అవ్వ‌డంతో గుమ్మ‌డికాయ‌ని కొట్టేశారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు. మా షూటింగ్ జ‌ర్నీ పూర్త‌యింది…మీ న‌వ్వుల జ‌ర్నీ ప్రారంభం కానుంద‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement