Monday, April 29, 2024

బీచ్​లో ఎంజాయ్​ చేస్తున్న బ్యూటీ..  మూడ్​ ఎట్లుందో చెప్పాలే అని అభిమానులకు ప్రశ్న

క్రేజీ ఆఫర్లతో జోష్​ మీదుంది మాళవిక మోహనన్​.. ఇప్పుడు మాల్దీవుల్లో తన వెకేషన్​ని ఎంజాయ్​ చేస్తోంది. కాగా అక్కడ తాను ఎంజాయ్​ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్​స్టాలో పోస్టు చేస్తూ ముచ్చట్లన్నీ అభిమానులకు షేర్​ చేస్తోందీ అమ్మడు. లేటెస్ట్​గా ఓ ఫొటోని షేర్​ చేసి ‘‘నా మూడ్​ ఎట్లుందో చెప్పాలే’’?  అని అభిమానులను ప్రశ్నించింది.  ప్రస్తుతం తానో బీచ్​లో ఉన్నానని ఇవ్వాల తెల్లవారుజామున మాల్దీవుల నుండి తన అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది.  ఆ పిక్స్​ ప్రస్తుతం  వైరల్​గా మారాయి.   మాల్దీవుల నుండి తన మొదటి పోస్ట్ ను షేర్​ చేసిన తర్వాత  అందులో తాను ఎప్పుడూ పర్వత ఆరోహణ చేయాలని చూస్తానని,  కానీ, ఈసారి అందుకు భిన్నంగా బీచ్​లో ఎంజాయ్​ చేస్తున్నట్టు తెలిపింది. 

కాగా, మాళవిక  రాబోయే థ్రిల్లర్ మూవీలో ధనుష్‌తో స్క్రీన్ షేర్​ చేసుకుంటోంది.  ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్​ కోసం షెడ్యూల్ అయ్యింది. మాళవిక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  యాక్షన్ -రొమాంటిక్ థ్రిల్లర్ యుధ్రా, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఓ మూవీలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement