Monday, April 29, 2024

Syria: బ‌స్ లో పేలుడు.. 17 మంది సైనికులు మృతి..!

ఓ బ‌స్ లో పేలుడు సంభ‌వించ‌డంతో 17మంది సైనికులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న సిరియాలో చోటుచేసుకుంది. ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, లేబనన్ ఇంకా సిరియా దేశాల్లో ఎప్పుడూ బాంబులు మోత మోగుతూనే ఉంటుంది. అయితే తాజాగా… సిరియా రాజధాని డమాస్కస్ లో విషాదం చోటుచేసుకుంది. రాజధాని డమాస్కస్ లో మిలటరీ బస్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సిరియా దేశానికి చెందిన 17మంది సైనికులు మృతిచెందారు. ఈ ఘటనకు పాల్పడిందెవ‌ర‌నే దానిపై కారణాలు తెలియ‌ రాలేదు. ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది తామేన‌ని ప్ర‌క‌టించ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement