Monday, April 29, 2024

కోలీవుడ్‌లో స‌త్తా చాట‌నున్న మెగాస్టార్.. రేపే గాడ్‌ఫాద‌ర్ త‌మిళ్ వెర్షన్ రిలీజ్..

మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో మెగా స్టార్ చిరంజీవి న‌టించిన‌ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా గాడ్‌ఫాద‌ర్. ఈ ద‌స‌రాకి రిలీజ్ అయిన సినిమాల్లో చిరంజీవి గాడ్ ఫాద‌ర్ రికార్డ్ స్థాయిలో క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంటోంది. ఆచార్య ప‌రాజ‌యం త‌ర్వాత త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఈ స‌క్సెస్‌తోచిరంజీవి బ‌దులు ఇచ్చాడు. వారం రోజుల్లోనే 150 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగుతో పాటు హిందీలో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు గాడ్‌ఫాద‌ర్ లాభాల‌ను మిగిల్చింది. టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమా త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోంది. విడుద‌ల తేదీ

తెలుగు, హిందీ భాష‌ల్లో ద‌స‌రా రోజున ఈ సినిమా రిలీజైంది. త‌మిళంలో మాత్రం వారం ఆల‌స్యంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. అంటే రేపు అక్టోబ‌ర్ 14న (శుక్ర‌వారం) గాడ్‌ఫాద‌ర్ త‌మిళ్ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. తెలుగు, హిందీతో పాటుగా త‌మిళంలోనూ ద‌స‌రా రోజున గాడ్‌ఫాద‌ర్ సినిమాను రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావించారు. కానీ త‌మిళ్ వెర్ష‌న్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఆల‌స్యం కావ‌డంతో వారం రోజులు వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement