Sunday, May 5, 2024

వ‌సూళ్ల‌తో దూసుకుపోతోన్న గాడ్ ఫాద‌ర్-ఎనిమిది రోజుల‌కి రూ.145.24 కోట్లు

గాడ్ ఫాద‌ర్ చిత్రం వసూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ద‌ర్శ‌కుడు మోహన్ రాజా తెర‌కెక్కించారు. ఈ నెల 5వ తేదీన విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే ఈ సినిమా 145.24 కోట్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆచార్య’ సినిమా వలన కలిగిన అసంతృప్తికి ‘గాడ్ ఫాదర్’ సమాధానం చెబుతుందని చిరంజీవి చెప్పినట్టుగానే జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement