Saturday, May 4, 2024

‘ఎత్తారెక్కుమ్ తునింద‌వ‌న్’ ట్రైల‌ర్ – మాస్ లుక్క్ లో సూర్య‌

చాలా రోజుల త‌ర్వాత హీరో సూర్య మాస్ గెట‌ప్ లో క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రం ఎత్తారెక్కుమ్ తునింద‌వ‌న్. ఈ చిత్రానికి పాండిరాజ్ ద‌ర్శ‌కుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భీకరంగా, ధైర్యంగా ఉండేవాడు అనే అర్థంవచ్చేలా టైటిల్ పెట్టారు. దీనితో సూర్య మాస్ విశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చని అభిమానులు అంచనాలు పెట్టుకుని ఉన్నారు. అంచనాలకు తగ్గట్లుగానే ET ట్రైలర్ అదిరిపోయింది. సూర్య విభిన్న షేడ్స్ లో మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నాడు. ‘వాడేమో సైంటిస్ట్ కావాలని ఆశపడ్డాడు.. నేనేమో మరో విధంగా కావాలని ఆశపడ్డాను.. కానీ కాలము, దైవము వాడిని ఇలా చూడాలని ఆశపడ్డాయి’ అని బ్యాగ్రౌండ్ లో డైలాగ్స్ వినిపిస్తుండగా సూర్య మాస్ ఎంట్రీ ఇస్తాడు. సూర్య గెటప్ పల్లెటూరి వ్యక్తి తరహాలో ఉంది. పంచె కట్టులో సూర్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే కొన్ని సన్నివేశాల్లో వైట్ షర్ట్, ప్యాంట్ ధరించి కనిపిస్తున్నాడు. మరి కొన్ని సీన్స్ లో సూర్య కత్తి పట్టుకుని శత్రువులని చెండాడే వాడిలా దర్శనం ఇస్తున్నాడు. సో ఈ మూవీలో సూర్య పాత్రలో డిఫెరెంట్ షేడ్స్ ఉన్నాయని ఫిక్స్ అయిపోవచ్చు. మార్చి 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.మార్చి 11న ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ విడుదల కానుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. సూర్య సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ట్రైలర్ లో ప్రియాంక లుక్స్ క్యూట్ గా ఉన్నాయి. సత్యరాజ్, శరణ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement