Sunday, April 28, 2024

పడకేసిన పరిశోధన .. తాజా కాగ్ నివేదిక

తాజాగా కాగ్‌ నివేదిక ఆసక్తికర అంశాలు బయట పెట్టింది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయని వెల్లడించింది. బీటెక్‌తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్‌డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్‌లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగ్‌ నివేదిక ప్రకారం గత రెండేళ్లలో ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్‌ఐటీల్లో 8,700 సీట్లు మిగిలిపోయినట్లు కాగ్‌ పేర్కొం ది. 2020-21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్‌ కోర్సుల సీట్లు 476 ఉండ గా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పీహెచ్‌డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కొత్త ఐఐటీలైన భువనేశ్వర్‌, గాంధీనగర్‌, హైదరాబాద్‌, ఇండోర్‌, జోధ్‌పూ ర్‌, మండి, పాట్నా, రోపార్‌ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయాయి. 2021-22లో అన్ని ఐఐటీల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్‌ కోర్సుల్లో 361 సీట్లు, పీజీ కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్‌డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్‌ పేర్కొంది.

దీనిపై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. ఇలాగే కొనసాగితే పలు అంశాల్లో కోర్సులను ఎత్తేయాలని చెబుతున్నారు. కేంద్ర విద్యా సంస్థలలో సీట్లు మిగిలిపోతుంటే ఇక సాధారణ కళాశాల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు భర్తీ కావట్లేదు.. మరోవైపు ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ పూర్తికాగానే విద్యార్థులు మంచి జాబ్స్‌కి ప్రియారిటీ ఇస్తున్నారు. దీంతో ఉన్నత విద్య ప్రాధాన్యత తగ్గింది. బీటెక్‌ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుం డటంతో పీజీ, పీహెచ్‌డీల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగం చేసి సంపాదిస్తే సరిపోతుంది. మళ్లి పీజీలు అవసరమా అనే భావం ఏర్పడుతోంది. దీంతో ఉన్నత విద్యపై విద్యార్థులు కన్నెత్తి చూడట్లేదు. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐఐటీలలోని పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో 28 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని కాగ్‌ నివేదకలో వెల్లడించింది.

కాగ్‌ నివేదిక ప్రకారం.. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్‌డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్‌ ఐఐటీల్లో ఒకటైన ఢిల్లిdలో 800 పీహెచ్‌డీ సీట్లు ఉండగా కేవలం 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. అనంతపురంలో వెలసిన కేంద్ర విశ్వ విద్యాలయంలో ప్రవేశపెట్టిన ఎంటెక్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ కోర్సులో ఒక్క విద్యార్ధి చేరలేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పరిశోధన పడకేసి దశాబ్దం అవుతుంది. ప్రతి ఏటా నిర్వహించాల్సిన రీసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష మూడు సంవత్సరాల కొకసారి నిర్వహిస్తూ ఇంటర్వ్యూలు అడ్మిషన్లు సంవత్సరంకాలం తీసుకుంటున్నారు. చాల విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులు లేక విభాగాలు మూసివేశారు. ఉన్న అరకొర అధ్యాపకులు డైరెక్టర్లుగా, ప్రిన్సిపాల్‌, రిజిస్ట్రార్‌, రెక్టార్లు, వీసీలుగా చలామణి అవుతున్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పనిచేసే డాక్టరేట్లను వీరు పట్టించుకోరు. పరిశోధన చేయాలని కుతూహలంగా ఉన్న అధ్యాపకులు ఎక్కువగా దిక్కుమాలిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల నుండి ఎక్కడో వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న అతీగతీ లేని విశ్వవిద్యాలయాల నుండి డబ్బు సమర్పించుకొని పనికిమాలిన పట్టాలు తెచ్చుకుంటున్నారు. పరిశోధనలకు నయాపైసా ఇవ్వకుండా, కొత్త అధ్యాపకుల నియామకాలు చేపట్ట కపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలలో విద్యా సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement