Tuesday, May 7, 2024

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..మూడు రోజుల్లోనే డబ్బు విత్ డ్రా

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే వారికి కేవలం మూడు రోజుల్లోనే ఈపీఎఫ్ క్లైమ్ అయ్యేలా మార్పులు చేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో నేపథ్యంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించేలా గతేడాది కేంద్రం కొన్ని మార్పులు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఆన్ లైన్ లో పీఎఫ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా UAN, పాస్ వర్డ్ నంబర్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ ఖాతాకు లాగిన్ అవ్వాలి.

  • ఆ తర్వాత ఆన్ లైన్ సేవలలో డ్రాప్-డౌన్ మెనులో ఉన్న #8216;క్లెయిమ్ (ఫారం -31, 19 amp; 10 సి)#8217; ఎంపికను ఎంచుకోవాలి.
  • తరువాత పాన్ కార్డ్, అధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా నంబర్‌తో సహా మీ వివరాలను చూపిస్తుంది. మీ బ్యాంక్ ఖాతా నంబర్ యొక్క చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, ధృవీకరించుపై క్లిక్ చేయండి.
  • టర్మ్స్ అండ్ కండిషన్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆన్ లైన్ లో కొనసాగింపు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • పిఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31) ఎంచుకోవాలి. అయితే ఇందులో ముందుగానే ఎంచుకోవడానికి గల కారణాన్ని పేర్కొనాలి. కరోనాను ఒక కారణమని తెలిపితే తాత్కాలికంగా విత్ డ్రా చేసుకోవచ్చు.
  • తర్వాత మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి.. అడ్రస్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు చెక్ లేదా.. అకౌంట్ వివరాలను అందులో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • పీఎఫ్ కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ లో ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడిన ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ పీఎఫ్ అమౌంట్ ఈ బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడానికంటే ముందు మీ ఓనర్ విత్ డ్రా పర్మిషన్ ఉండాలని గుర్తుంచుకోండి.
  • అత్యవసర పరిస్థితులలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మూడు రోజుల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి అన్ని కేవైసీ పత్రాలను కలిగి ఉండాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement