Saturday, May 4, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 3
3.
తేజ: క్షమా ధృతి: శౌచమ్‌
అద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీమ్‌
అభిజాతస్య భారత ||

తాత్పర్యము : తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట, అను దివ్యగుణములు దైవీస్వభావము కలిగిన దిమ్యల యందుండును.

భాష్యము : క్షత్రియ, వైశ్య, సూద్రులకు ఉండవలసిన లక్షణములు ఈ శ్లోకము నందు వివరించుటమైనది.

తేజ: :- క్షత్రియులు తేజస్సును కలిగి బలహీనులకు రక్షణను ఇవ్వవలెను, దాని కోసము హింసకైనా వెనుకాడరాదు.
సౌచము :- మనస్సు, శరీరము పరిశుద్ధతను కలిగి ఉండవలెను. వ్యాపారులు అక్రమరీతిలో ధనమును సంపాదించరాదు.
నాతిమానిత :- గౌరవము ఆశించకుండుట, శూద్రులు అనవసరపు మర్యాదలను ఆశించకుండా, మిగిలినవారికి సహకరిస్తూ ఉండవలెను.

ఇక్కడ శ్రీ కృష్ణుడు అర్జునున్ని, అభిజాతా అని సంభోదించెను. అనగా అతడు దైవ లక్షణాలతో జన్మించాడని అర్థము.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement