Sunday, May 5, 2024

నేడు ఈడీ విచారణకి.. తేజ‌స్వి యాద‌వ్

నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ బీహార్ ఉప‌ముఖ్య‌మంత్రి..రాష్ట్రీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ని విచారించ‌నుంది. కాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ‘లాండ్ ఫ‌ర్ జాబ్స్ స్కామ్’ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయ‌న ఈడీ కార్యాలయానికి బయలుదేరారు.2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించిన అవినీతి, మనీలాండరింగ్ దర్యాప్తుల్లో యాదవ్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మార్చిలో విచారించగా, ఆయన సోదరి మీసా భారతిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది.

తేజస్వి యాదవ్ కు చెందిన కంపెనీ అభివృద్ధి చేస్తోందని ఆరోపిస్తూ గురుగ్రామ్ లో ఇంకా నిర్మాణంలో ఉన్న మాల్ తో సహా రెండు డజనుకు పైగా చోట్ల సీబీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది. లాండ్ ఫ‌ర్ జాబ్స్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి ఈ సోదాలు జరిగాయి. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఈ కుంభకోణం జరిగిందని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ, ఆయన కుమార్తెలు మీసా, హేమ యాదవ్ లకు 2008-2009లో రైల్వేశాఖ ఉద్యోగాల‌కు సంబంధించి కొందరు వ్యక్తులు లంచాలు ఇచ్చారని, ముంబ‌యి, జబల్ పూర్, కోల్ కతా, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చిన 12 మంది వ్యక్తులకు కూడా భూమి ప్లాట్లు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.ఈ మేర‌కు నేడు ఆయ‌న ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement