Sunday, May 5, 2024

Mulugu : గోదావరి వరదల ఎఫెక్ట్‌.. ఏజెన్సీలో పూర్తిగా దెబ్బ‌తిన్న రోడ్లు

వాజేడు (ప్రభ న్యూస్): గోదావరి వరదలు ఊళ్ల‌ను ముంచెత్త‌డంతోపాటు.. రోడ్ల‌ను దెబ్బ‌తీశాయి. ఏజెన్సీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను జలమయం చేయడమే కాక పలు రహదారులను నీట ముంచి ధ్వంసం చేశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధుల కింద మూడు కోట్ల రూపాయలతో మంజూరైన చుండుపట్ల గ్రామం నుండి పెర్రి పాయింట్ గోదావరి వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈమ‌ధ్య‌నే సాయి దత్త కంపెనీ ఈ బీటీ రోడ్డు చుండుపట్ల గ్రామం నుండి సుమారు రెండు కిలోమీటర్ల మేర వేసింది. మార్గమధ్యలో ఉన్న వంతెనల వద్ద రోడ్డు కొట్టుకుపోయి వరద నీళ్లు పోయేందుకు వేసినటువంటి తూముల దగ్గర పైపులు మాత్రమే క‌నిపిస్తున్నాయి. గోదావరి వరదల కారణంగా పది కాలాలపాటు ఉపయోగపడాల్సిన రహదారి మూన్నాళ్ల‌ ముచ్చటగా మారింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధ్వంసమైన రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement