Sunday, May 5, 2024

కొనసాగుతున్న సహాయక చర్య‌లు.. పున‌రావాస కేంద్రాల‌ను ప‌రిశీలించిన పువ్వాడ‌

భద్రాచలం సమీప ప్రాంతాల్లో వరద ముంపున‌కు గురైన ప్రాంతాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ‌నివారం పర్యటించారు.
కొనసాగుతున్న సహాయక చర్యల‌ను ప‌రిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు. భద్రాచలం – చర్ల ప్రధాన రహదారిపై వరద నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్తంభించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అటు ఎవరూ వెళ్లకుండా పోలీస్ సిబ్బందిని నియ‌మించాల‌ని జిల్లా ఎస్పీ వినీత్ కు సూచించారు. యాటపాక వద్ద రక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని సైనిక అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం.. గోదావరి నది వరద బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ దర్శించారు. అక్క‌డ ఆశ్ర‌యం పొందుతున్న వారితో మాట్లాడారు. అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజుల పాటు ఇక్కకడే ఉండాలని, ఎలాంటి ఇబ్బందీ ఉండదని భరోసానిచ్చారు. ఆహారం, మెడిసిన్, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పువ్వాడ అజ‌య్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement