Friday, May 3, 2024

రెండు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. తీవ్రత 4.3గా నమోదు

గత కొన్ని రోజులుగా ఎక్కడో ఒక చోట భూకంపాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా.. బీహార్, పశ్చిమ బెంగాల్‌ లో భూమి స్వల్పంగా కంపించింది. ఈరోజు ఉదయం బీహార్‌లోని అరారియాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. పూర్నియాకు సమీపంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

అలాగే… జమ్మూకశ్మీర్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 గా నమోదైంది. ఈరోజు ఉదయం 10.10 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. భూకంప కేంద్రం లోతు 10 కి.మీ ఉందని తెలిపింది. అయితే భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టుగా నివేదికలు వెలువడలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement