Saturday, May 4, 2024

డీఆర్డీవో చైర్మన్‌ సతీష్‌ రెడ్డికి కీలక బాధ్యతలు.. కేంద్ర రక్షణ మంత్రి సలహాదారుగా నియామకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డీవో) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న తెలుగు బిడ్డ జి. సతీష్‌ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. డిఆర్డీవో కొత్త ఛైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్‌ వి. కామత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన కామత్‌ డిఆర్డీవో ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటి వరకు ఆ పదవిలో సతీష్‌ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు. కామత్‌కు 60 ఏళ్ళు వచ్చేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డిఆర్డీవో వెల్లడించింది.

దేశంలోని అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా సతీష్‌ రెడ్డి పేరొందారు. అగ్ని, పృద్ధ్వీ, ఆకాశ్‌ వంటి క్షిపణి వ్యవస్థల కోసం, నావిగేషన్‌, ఏవియానిక్స్‌ డిజైన్‌ రూపొందించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 2018లో సతీష్‌ రెడ్డి డిఆర్డీవో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2020లో కేంద్రం ఆయన పదవీకాలాన్ని రెండేళ్ళు పొడగించింది. గడవు పూర్తి కావడంతో సతీష్‌ రెడ్డిని కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement