Monday, May 20, 2024

Honey Trap: నటాషా వలలో డీఆర్‌డీఎల్‌ ఉద్యోగి.. హనీట్రాప్​ని ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీఎల్‌లో పని చేస్తున్న ఒక ఉద్యోగి పాకిస్తాన్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్‌లో పడ్డారు. ఫేస్‌బుక్‌ ద్వారా డీఆర్‌డీఎల్‌ ఉద్యోగి మల్లిఖార్జునరెడ్డిని నటాషా పేరుతో ట్రాప్‌ చేసిన పాకిస్తాన్‌ మహిళ డీఆర్‌డీఎల్‌కు చెందిన కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది.

నటాషా తన కూడా ఆర్మీ అధికారినని మల్లిఖార్జునరెడ్డిని నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. డీఆర్‌డీఎల్‌కు చెందిన ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు మల్లిఖార్జునరెడ్డిని అరెస్టు చేసి విచారించగా విషయం బహిర్గతమైంది. దీంతో అతడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. మల్లిఖార్జునరెడ్డిని నేడో రేపో డిఫెన్స్‌ ఇంటెలీజెన్స్‌ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement