Monday, May 6, 2024

బీజేపీ లీడ‌ర్ల‌కు హెయిర్ కటింగ్ చేసేదేలే.. కేంద్రం నిర్ణ‌యంపై వృత్తి సంఘాల నేత‌లు

విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ రాష్ట్ర రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు ఆరోపించారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నేతృత్వంలో రజక సంఘాల నేతలు, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైఖరి కారణంగా ఆ పథకం రద్దయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

నూతన విద్యుత్ చట్టం ముసాయిదాలో సబ్సిడీలు ఎత్తివేయాలని, ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలని పేర్కొనడం దారుణమన్నారు. కేంద్రం వైఖరికి నిరసగా ఈ నెల 20వ తేదీ నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. ఆందోళనలో భాగంగా బీజేపీ నేతలకు క్షవరాలు చేయకూడదని తీర్మానించినట్టు నాయీ బ్రాహ్మణ నేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement