Sunday, May 5, 2024

Big Breaking | ఫుడ్​ డెలివరీకి వెళ్తే డాబర్​మన్​ దాడి.. మూడో అంతస్తు నుంచి దూకిన బాయ్​

హైదరాబాద్​లోని రాయదుర్గం పంచవటి కాలనీలో దారుణం జరిగింది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఫుడ్‌ డెలివరీ కోసం ఓ బిల్డింగ్​లోని మూడో అంతస్తుకు డెలివరీ బాయ్ వెళ్లాడు. అయితే.. అక్కడున్న పెంపుడు కుక్క అతనిపైకి దూసుకొచ్చింది. అది మామూలు కుక్క అయితే పర్వాలేదు కానీ, డాబర్‌మెన్ కావడంతో అతను భయంతో పరుగందుకున్నాడు. ప్రాణ భయంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో డెలివరీ బాయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అక్కడి వారు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని హెల్త్​ పరిస్థితి ఎట్లుందన్నది ఇంకా తెలియరాలేదు.

అయితే.. ఇవ్వాల (ఆదివారం) ఉదయం మణికొండలో కూడా ఇట్లాంటి ఘటనే జరిగింది. అమెజాన్​ డెలివరీ బాయ్​ మీదకు కుక్క దూసుకొచ్చింది. దీంతో అతను ప్రాణాలతో తప్పించుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement