Sunday, April 28, 2024

Bitchagadu – 2 : ఏందయ్యా ఇది సెకండాఫ్‌ చూపావ్

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌లో వింత అనుభవం చోటుచేసుకుంది. ‘బిచ్చగాడు 2’ సినిమా చూసేందుకు అక్కడకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని చిత్రం ఎదురైంది. ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియదుగానీ మల్టీప్లెక్స్‌ సిబ్బంది చేసిన పనికి ఆడియన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని నిలదీశారు.

వివరాల్లోకి వెళితే స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్‌ నటుడు విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘బిచ్చగాడు 2’.. ఈ నెల 19న విడుదలైంది. ఆదివారం.. ఆ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా మార్నింగ్‌ షోని సెకండాఫ్‌తో ప్రారంభించారు. ప్రేక్షకులు కథలో లీనమవడంతో అది ద్వితీయార్థం అని వారు గమనించలేకపోయారు. చివరల్లో వచ్చే క్రెడిట్స్‌ టైటిల్స్‌ చూసి అసలు విషయం గుర్తించారు. సగ భాగంతోనే సినిమాని పూర్తిచేశారంటూ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేయమని కోరారు. ఫస్ట్ ఆఫ్ వేస్తామని చెప్పినా ప్రేక్షకులు వినలేదు. డబ్బులు ఇచ్చే వరకూ మల్టీప్లెక్స్‌లో బైఠాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement