Monday, April 29, 2024

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ‘అఖండ’ – ఎప్పుడంటే

అఖండ చిత్రం ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. జ‌న‌వ‌రి 21నుంచి అఖండ‌లో ఓటీటీలో సంద‌డి చేయ‌నుందని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వెల్ల‌డించింది. ఈ నెల 14న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయ‌నుంద‌ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ప్ర‌క‌టించినా , కొంత ఆల‌స్యంగా స్ట్రీమింగ్ కానుంది. కాగా డిస్నీ ప్ర‌క‌ట‌న‌తో హీరో బాల‌కృష్ణ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ. 150 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం… బాలయ్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన అఖండ… ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement