Monday, May 6, 2024

డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ.. యుద్ధం నేపథ్యంలో సీతా రామం..

సినిమాల్లో డిఫరెంట్‌ లవ్‌ స్టోరీస్‌ వస్తుంటాయి. వెండితెరపై మర్చిపోలేని ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడు హనురాఘవ పూడి దర్శకత్వంలో మరో కొత్త సినిమా వస్తోంది. స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా యుద్ధం నేపధ్యంలో అందమైన ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. వైజయంతీ మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్‌, ప్రియాంక దత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్‌ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న మరో కీలకమైన పాత్రలో కనిపించనుంది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటిం చింది. ఈ చిత్రానికి సీతా రామం అనే టైటిల్‌ ని ఖారారు చేశారు.’ ‘యుద్ధం తో’ రాసిన ప్రేమకథ” అనేది ఉపశీర్షిక. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ పంచు కున్న టైటిల్‌ గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

టైటిల్‌ గ్లింప్స్‌లో యుద్ధంలో సీతారాములని నువ్వే గెలిపించాలి’ అనే డైలాగ్‌ టైటిల్‌ తగ్గట్టు అద్భుతంగా ఉంది. ఆఫ్రీన్‌ పాత్రలో రష్మిక మందన్న రివిల్‌ నటించారు. తర్వాత సీత పాత్రలో హీరోయిన్‌ మృణాళిని, రాముడి పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించడం ఆసక్తికరంగా వుంది. యుద్ధం నేపధ్యంలో సాగే ఈ ప్రేమ కథలో లెప్టినెంట్‌ రామ్‌ గా దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నారు. టైటిల్‌ వీడియోలో దుల్కర్‌ సల్మాన్‌, మృణాళిని ఠాకూ ర్‌, రష్మిక మందన్న అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. టైటిల్‌ గ్లింప్స్‌ చూస్తే ఈ సినిమా విజువల్‌ ట్రీట్‌ గా వుండబోతుందని అర్ధమౌతుంది. వెటరన్‌ సినిమాటోగ్రఫర్‌ పీఎస్‌ వినోద్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు. చివరి దశలో వున్న ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement