Friday, May 3, 2024

డీజిల్ ధర ఒకేసారి రూ.75 పెంపు – పెట్రోల్ లీటర్ రూ.254 ..!

రెండు దేశాల యుద్ధం… ధ‌ర‌ల పెరుగుతున్నాయ్… అంద‌రూ సిద్ధంగా ఉండండి.. అన్న‌ట్లు ఉంది ఉక్రెయిన్-రష్యా​ యుద్ధం. ఈ యుద్ధం అంతర్జాతీయంగా నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. అలాగే ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలకు అనుగుణంగా.. శ్రీలంకలో పెట్రోల్​, డీజిల్‌ ధరలను భారీగా పెంచింది చమురు విక్రయ కంపెనీ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్​ఐఓసీ). ఇది భారత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్​ అనుబంధ సంస్థ. తాజా ధరల పెంపుతో అక్కడ ఇంధన ధరలు డబుల్​ సెంచరీని దాటేశాయి. శ్రీలంకలో లీటర్‌ డీజిల్‌పై రూ.75(శ్రీలంక రూపాయి), పెట్రోల్‌పై రూ.50 చొప్పున పెంచినట్లు ఎల్‌ఐఓసీ తెలిపింది. ​దీంతో లీటరు పెట్రోల్​ ధర రూ.254కు చేరగా.. లీటర్​ డీజిల్ ధర రూ.214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమైనందున ఎల్​ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఒకే నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement