Monday, April 29, 2024

పునీత్‌ పుట్టిన రోజున జేమ్స్‌..

కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్‌’. చేతన్‌ కుమార్‌ దర్శకుడు. కిశోర్‌ పత్తికొండ నిర్మించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పునీత్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్‌ నటించగా, విలన్‌గా టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్‌ నటించారు.

హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్నట్టు విజయ్ తెలిపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌, శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ప్రియా ఆనంద్‌, శ్రీకాంత్‌, శరత్‌ కుమార్‌, ముఖేష్‌ రిషి, ఆదిత్య మీనన్‌ తదితరులు నటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement