Friday, May 3, 2024

ఎన్‌ఎంఎంఎస్‌ హాల్‌ టికెట్లు విడుదల..

జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎం ఎంఎస్‌) పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌ టికెట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవానందరెడ్డి తెలిపారు. ఈ నెల 20 ఆదివారం ఉ.10 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థుల హాల్‌ టికెట్లు పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్‌సైటు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.బీఎస్‌ఈ. ఏపీ.జీవోవీ.ఐఎన్‌లో స్కూల్‌ లాగిన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత ప్రధాన్యోపాధ్యాయులు హాల్‌ టికెట్ల కోసం యూ-డైజ్‌ కోడ్‌ను ఉపయో గించి లాగినై తమ తమ పాఠశాలల విద్యార్థుల హాల్‌ టికెట్లను డౌన్లోడ్‌ చేసి విద్యార్థులకు అందచేయాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement