Saturday, May 4, 2024

శ్రీశైలానికి పోటెత్తుతున్న భక్తులు – మహాశివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయం

శ్రీశైలానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తమ‌ ఇష్టదైవమైన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను
దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈక్రమంలో ఏర్పాట్లలో ఆలయ అధికారులు నిమగ్నమై ఉన్నారు. దేవస్థానం ప్రధాన కూడళ్లు, వీధులు,ఖాళీ ప్రదేశాల్లో తాత్కాలిక విడదీ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ టెంటులను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్వామి, అమ్మవారు ఉభయ ఆలయాల పరిధిలో శివదీక్ష స్వాములకు చంద్రావతి కళ్యాణమండపం నుంచి ఆలయ రాంగోపురం రాజా ప్రత్యేక క్యూలైన్ సదుపాయం సిద్ధం చేశారు . అలాగే సర్వదర్శన క్యూలైన్లు ఏర్పాటు చేశారు . ఉచిత దర్శన క్యూకంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండేందుకు అనువుగా సదుపాయాలు కల్పించారు . ఆలయ మాడవీధుల్లో భక్తులకు ఎండ తీవ్రత కారణంగా కాళ్లు కాలకుండా కూలింగ్ పెయింట్ మార్గాలు ఏర్పాటు చేశారు . గంగాధర మండపం వద్ద ఆలయద్వారానికి అలంకరణ ఏర్పాట్లు సాగుతున్నాయి . ఆలయంలోని వివిధ విభాగాల్లో మరమ్మతులు చేపడుతున్నారు . రద్దీ క్రమబద్ధీకరణకు అవసరమైన బారికేడ్లను సిద్ధం చేస్తున్నారు . క్షేత్ర పరిధిలోని ప్రధాన వీధుల్లో భారీ ఎత్తున బ్రహ్మోత్సవ స్వాగతతోరణాలు ( ఆర్బీద్వారాలు ) ఏర్పాటు చేశారు . ఉభయ ఆలయాలు , ప్రతి ప్రధాన వీధులు , దేవస్థాన వసతి భవనాలను రంగురంగుల విద్యుద్దీపాలంకరణ గావించారు.

ఉత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా విభాగాల పరిదిలో స్వామి అమ్మవార్ల దర్శనాలు , ఉభయదేవాలయ నిర్వహణపై ముందస్తు చర్యలు తీసుకున్నారు . అలాగే తాగునీరు క్యూలైన్ అవసరమైన మరుగుదొడ్లు , ట్రాఫిక్ క్రమబద్ధీకరణ , పార్కింగ్ , శివదీక్ష శిబిరాల్లో శివస్వాములకు ప్రత్యేక సదుపాయాలు , వైద్యశిబిరాలు , పాతాళగంగలో స్నానఘాట్ల పటిష్టత , బారికేడింగ్ , స్వామివారి లడ్డూ ప్రసాదం తదితర వాటికి సౌకర్యాలు కల్పించారు. మొత్తంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది . క్షేత్ర నలుమూల వివిధ రకాల ఏర్పాట్ల హడావిడి కనిపిస్తోంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎస్ . లవన్న సదుపాయాల కల్పనపై స్వయంగా పరిశీలన చేస్తున్నారు. ఆలయానికి చెందిన వివిధ విభాగాధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ తను ముందుండి పనులను, కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.ఈక్రమంలో దేవస్థానం విభాగాల వారీగా ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన పనులు చకచకసాగుతున్నాయి . దేవస్థాన యంత్రాంగం . సదుపాయాల కల్పనలో తలమునకలై ఉంది. మల్లన్న స్పర్శ దర్శనం ఉత్సవాలకు ముందే కల్పిస్తుంచడంలో ఇప్పటికే శ్రీశైలానికి శివదీక్ష భక్తుల రాక మొదలయింది . ఇరుముడి స్వాములు శ్రీశైలానికి కాలినడకనచేరి మల్లన్నను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని , అన్నదాన మందిరంలో రద్దీకి సరిపడా సదుపాయాలను అధికారులు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement