Tuesday, May 21, 2024

గాయంతో దూర‌మైన దీప‌క్ చాహ‌ర్ : సీఎస్కే కు భారీ దెబ్బ

ఈ ఐపీఎల్ సీజ‌న్ లో సీఎస్ కే ప్రారంభ మ్యాచ్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్ లు వ‌రుస‌గా ఓడిపోయింది. అయితే వెన్ను గాయం కారణంగా ఐపీఎల్​లో ఆడాలనే దీపక్​ చాహర్ ఆశలు గల్లంతయ్యాయి. దీంతో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నైసూపర్​ కింగ్స్​కు కోలుకోలేని దెబ్బపడినట్లు అయ్యింది. ఫిబ్రవరిలో వెస్టిండీస్​తో మూడో టీ20 సందర్భంగా చాహర్ గాయపడ్డాడు. ఆ తర్వాత జరిగిన శ్రీలంక పర్యటనకూ దూరమయ్యాడు. భారీ షాట్లూ ఆడగల ఈ బౌలింగ్​ ఆల్​రౌండర్​.. గతేడాది సీఎస్​కే నాలుగోసారి టైటిల్ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తమ ప్రధాన అస్త్రం చాహర్​ లేకుండానే ఈ సీజన్​లో బరిలోకి దిగిన చెన్నై.. ఆడిన నాలుగు మ్యాచ్​ల్లోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
మెగావేలంలో రూ.14 కోట్లు పెట్టి తిరిగి దక్కించుకున్న చాహర్​.. ఏప్రిల్ రెండో వారంలో అందుబాటులోకి వస్తాడని చెన్నై ఆశించింది. అయితే తొడ కండరాల గాయం నుంచి కోలుకొని బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీలో ఫిట్​నెస్​ కోసం ప్రయత్నిస్తున్న చాహర్​కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు ఐపీఎల్​ 15 మొత్తానికి దూరమవుతాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement