Saturday, December 7, 2024

67th Match: ఢిల్లీని ఉతికి ‘ఆరేసి’ న CSK.. టార్గెట్ 224

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య 67వ ఐపీఎల్ మ్యాచ్ లో సీఎస్ కే టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేపట్టింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సీఎస్ కే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సీఎస్ కే బ్యాట్స్ మెన్లు ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఓపెనర్లు ఇద్దరూ భారీ భాగస్వామ్యం చేయడంతో సీఎస్ కే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. సీఎస్ కే బ్యాట్స్ మెన్లు డెవాన్ కాన్వే 87 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 79 పరుగులు, శివమ్ దూబే 22 పరుగులు, రవీంద్ర జడేజా 20 పరుగులు చేశారు ఢిల్లీ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 224 పరుగులు చేయాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement