Tuesday, May 14, 2024

G 7 Summit – మోడీతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటి…

టోక్యో: జపాన్ లో జరుగుతోన్న జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ని కలిశారు. రష్యా- ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడిని తొలిసారి జ‌రిగిన‌ భేటి చ‌ర్చ‌నీయంశ‌మైంది. ఈ సందర్భంగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. యుద్దం, ప్ర‌స్తుతం ఉక్రేయిన్ లోని ప‌రిస్థితుల‌పై ఇరు దేశాల నేత‌లు సుదీర్ఘంగా చర్చించారు..

ఈ సమావేశంలో యుద్ధం గురించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య. ఇది ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది, కానీ నేను దానిని రాజకీయ లేదా ఆర్థిక సమస్యగా పరిగణించను. ఇది నాకు, మానవత్వం మరియు మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలు మా అందరికంటే మీకు బాగా తెలుసు.గత సంవత్సరం మా పిల్లలు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు, మీ పౌరుల వేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఈ పరిస్థితులను పరిష్కరించడానికి భారతదేశం, నేను వ్యక్తిగతంగా సాధ్యమైనదంతా చేస్తాం” అని ప్రధాని మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి హామీ ఇచ్చారు

ఈ భేటీలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దొవల్ ఉన్నారు. ఏడు దేశాలతో జరుగుతున్న జీ7 భేటీలో పాల్గొనాలని జపాన్ జెలెన్స్కీని ఆహ్వానించింది. కాగా ఉక్రెయిన్‌- రష్యా వివాదంపై మోడీ, జెలెన్‌స్కీలు ఇప్పటికే పలుమార్లు ఫోన్‌లో, వర్చువల్‌గా మాట్లాడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో మొదటినుంచి తటస్థ వైఖరి అవలంబిస్తోన్న భారత్ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించింది.

ఇది ఇలా ఉంటే మరోవైపు జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌, ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ తదితరులతో సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌, జపాన్‌ తదితర దేశాధినేతలతో చర్చలు జరిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement