Sunday, April 28, 2024

కొవిన్ యాప్ క్రాష్.. సర్వర్​లో సాంకేతిక లోపం

కరోనా మహమ్మారిని కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా క‌రోనా టీకా రిజిస్ర్టేష‌న్ల కోసం ఏర్పాటు చేసిన కొవిన్ యాప్ లో సాంకేతిక స‌మస్య‌లు ఏర్ప‌డ్డాయి. రిజిస్ర్టేష‌న్లు ప్రారంభ‌మైన కొద్దిసేప‌టికే కొవిన్​ పోర్టల్​, ఆరోగ్యసేతు యాప్​లో స‌ర్వ‌ర్లు క్రాష్ అయ్యాయి. ఓటీపీలు ఆల‌స్యంగా వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఒక్క‌సారిగా ర‌ద్దీ పెర‌గ‌డంతో స‌ర్వ‌ర్లు క్రాష్ అయి రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ‌కు అంత‌రాయం క‌లిగింది.

వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు దాటిన వారందరికీ టీకా నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. టీకాల కోసం సాయంత్రం 4 గంట‌ల నుంచి  కొవిన్, ఆరోగ్యసేతు యాప్ లలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ సమస్య తలెత్తింది. అయితే కొద్ది మందికి మాత్రం ఎలాంటి సమస్యలు రాలేదు. అటు ఆరోగ్యసేతు యాప్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైనట్లు నెటిజన్లు పోస్ట్‌లు చేశారు. సర్వర్‌ ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చినట్లు చెప్పారు. కొంతమందికి ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయి. అయితే ప్రస్తుతం కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ అందుబాటులోనే ఉంది.

అయితే, వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించటం వల్ల వెబ్‌ సైట్​లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. చాలా మందికి ఈ సమస్యలు తలెత్తడంతో వారంతా సోషల్‌ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement