Saturday, April 20, 2024

కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలి: కేంద్రమంత్రి గడ్కరీ

కరోనా మహమ్మారి రెండో దశలో తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. కరోనా దెబ్బకు సామాన్యుడితో పాటు ధనిక వర్గాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రెండో దశ చల్లారక ముందే మూడో దశకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రజలకు సూచించారు. రెండో దశ నుంచి మూడో దశ కి చేరుకునే లోపు రాష్ట్రాలు మౌలిక సదుపాయలు పెంచుకోవాలని మంత్రి సూచించారు. వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రెండో దశ కాకుండా మూడు, నాలుగో దశలు కూడా ఉన్నాయని, వాటికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement