Sunday, April 28, 2024

ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ మార్క్ దాటిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. శనివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఏఎఫ్‌పీ ట్యాలీ గణాంకాల ప్రకారం.. శనివారం నాటికి 207 దేశాల్లో 1,00,29,38,540 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించడం లేదు. అయినప్పటికీ ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ పై నమ్మకం ఉంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో వ్యాక్సినేషన్ ప్రకియ ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్నట్టు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఒక్క నెలలోనే డోసుల సంఖ్య రెండు రెట్టు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్ డోసుల్లో 47 శాతాన్ని ప్రపంచ జనాభాలోని 16 శాతానికి అందిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement