Monday, May 13, 2024

దేశానికి అభివృద్ధి అవసరం.. షార్ట్‌కట్ రాజకీయాలు కాదు.. ప్రధాని మోడీ

దేశానికి అభివృద్ధి అవసరమని, షార్ట్‌కట్ రాజకీయాలు కాదని తెలిపారు ప్రధాని నరేంద్రమోడీ. షార్ట్‌కట్‌ రాజకీయాలతో దేశాభివృద్ధి జరగదని అన్నారు. ప్రధాని మోడీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ము అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాలతో వృథా అయ్యేదని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మానవీయ స్పర్శతో జరిగిందని అన్నారు.

అభివృద్ధి చెందిన భారతదేశం అన్ని రాష్ట్రాల ఐక్య బలం, పురోగతి, అభివృద్ధి ద్వారా వాస్తవికత అవుతుంది. అభివృద్ధి పట్ల మనకు సంకుచిత దృక్పథం ఉంటే అవకాశాలు కూడా పరిమితంగా ఉంటాయి. గత ఎనిమిదేళ్లలో మేము సబ్‌కా సాత్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌తో మనస్తత్వం, విధానాన్ని మార్చామని అన్నారు. నాగ్‌పూర్‌లో ప్రారంభించిన, మొదలుపెట్టిన ప్రాజెక్టులు అభివృద్ధి సమగ్ర దృక్పథాన్ని అందించాయని చెప్పారు. రాజకీయ నాయకులు షార్ట్‌కట్ రాజకీయాలకు పాల్పడడం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును దోచుకోవడం, తప్పుడు వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement