Friday, May 17, 2024

కీల‌క తీర్పు ఇచ్చిన క‌ర్ణాట‌క హైకోర్టు.. బిడ్డ పుట్ట‌క ముందే ద‌త్త‌త తీసుకోవ‌డం కుద‌ర‌దు

క‌ర్ణాట‌క‌ట హైకోర్టు కీల‌క‌తీర్పు ఇచ్చింది. బిడ్డ పుట్టక ముందే దత్తత తీసుకునేందుకు కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. నగదు కోసం జరిగే ఇలాంటి ఒప్పందాలకు చట్టంలో చోటేలా సాధ్యమని జస్టిస్ బి వీరప్ప, జస్టిస్ కె ఎస్ హేమలతలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ముందుగా చేసుకున్న దత్తత నిబంధనలకు అనుగుణంగా రెండేళ్ల 9 నెలల బిడ్డను పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఒక ముస్లిం దంపతులు ఉడిపి జిల్లా న్యాయస్థానంలో ఆర్జీ దాఖలు చేశారు.

వారి పిటిషన్ ని ఉడిపి కోర్టు కొట్టి వేసింది. దీనిని ప్రశ్నిస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుని విచారించిన కర్ణాటక హైకోర్టు ఇస్లాం చట్టాల ప్రకారం బిడ్డ పుట్టక ముందే దత్తత ఒప్పందాలు చేసుకోవడం సాధ్యం కాదని, ఇతర మతాలకు చెందిన వారిని ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. హిందూ దంపతులు తమ బిడ్డను విక్రయించుకోలేదనే విషయాన్ని తేల్చాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ అధికారులను ధర్మసనం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement