Friday, May 17, 2024

ప్రాణాల‌కు తెగించి మ‌హిళ‌ని కాపాడిన కానిస్టేబుల్ – ప్ర‌శంస‌లు కురిపించిన రేవంత్ రెడ్డి

క‌దులుతున్న రైలు నుంచి ఓ మ‌హిళ దూకేసింది. దాంతో ఆమె రైలు, ప్లాట్ ఫాం మ‌ధ్య‌లో ప‌డ‌బోయింది.ఈ విష‌యాన్ని గుర్తించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి ఆ మ‌హిళ‌ని కాపాడాడు. ఈ ఘ‌ట‌న కృష్ణా ఎక్స్ ప్రెస్ లో ఆ మ‌హిళ‌ తిరుపతి నుంచి వరంగల్ వ‌చ్చిన స‌మ‌యంలో చోటు చేసుకుంది. ఆమె ప్రాణాలు కాపాడిన‌ కానిస్టేబుల్ చిన్నరామయ్యపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి కూడా చిన్న రామ‌య్య‌ను అభినందిస్తూ ఆయ‌న చేసిన సాహ‌సానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో ప్రమాదవశాత్తు నడుస్తున్న రైలు కింద జారిపడిపోయిన పార్వతి అనే మహిళను ప్రాణాలకు తెగించి కాపాడిన పీఆర్ఎఫ్ కానిస్టేబుల్ చిన్న రామయ్య గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రామయ్య… మీరు నిజమైన హీరో’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement