Thursday, May 2, 2024

ఆరోగ్యాన్ని ప్రసాదించే పాదోదకం!

ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం చేసుకున్నాక ఆలయ పూజారులు ”అకాల మృత్యుహరణం… సర్వరోగ నివారణం.. . ఆయురారోగ్యాభివృద్యర్థంఆంజనేయస్వామి పాదోదకం పావ నం కరిష్యే” ఇలా ఏ దేవాలయానికి వెళితే ఆ దేవుని పాదోదకంగా తీర్థాన్ని భావించి పూజారులు ఇస్తారు. వారు ఇచ్చే తీర్థాన్ని కళ్ళకు అద్దుకుని సేవిస్తాం. నమ్మకంతో… భక్తితో తీర్థాన్ని సేవిస్తే అనారోగ్య బాధలు, ఈతిబాధలు తగ్గుతాయని పెద్దలు అంటారు.
జల తీర్ధం: ఈ తీర్ధం సేవించడం ద్వారా అకాల మరణం, సర్వ రోగాలు నివారించబడతాయి. అన్ని కష్టాలు తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది.
కషాయ తీర్ధం: ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచలప్రదేశ్‌లోని జ్వాలమాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు. రాత్రి పూజ తరువాత తీర్థమును కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించటం ద్వారా కనీకనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.
పంచామృత అభిషేక తీర్థం: పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
పానకా తీర్ధం: శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహదేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాలస్వామి, పాన కాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు. కారణం స్వామికి పాన కాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు. పానకా తీర్ధాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్థితికి వచ్చేవిధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జర గదు. ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి. నీర సం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇవేకాకుండా తులసి తీర్థం, పచ్చకర్పూర తీర్థం, బిల్వతీర్థం, ఇలా ర కరకాల తీర్థాలను కూడా ఆయా ప్రాంతాలలో ఇస్తుంటారు. వీటిని సేవించడంవల్ల ఆరోగ్యం లభిస్తుంది. మనసు ప్రశాంతత ఏర్పడుతుంది. సనాతన హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం మన సంస్కృతీ సాంప్ర దాయాలను మన పిల్లలకు, భావితరాల వారికి చేరవేద్దాం.
– కామిడి సతీశ్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement