Saturday, May 4, 2024

పంజాబ్ సీఎం ‘భ‌గ‌వంత్ మాన్’ కి – ప్ర‌ధాని శుభాకాంక్ష‌లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ..పంజాబ్ సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన ఆప్ నేత భ‌గ‌వంత్ మాన్ కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. పంజాబ్‌లోని భ‌గ‌త్ సింగ్ స్వ‌గ్రామం ఖ‌త్క‌ర్ క‌లాన్‌లో పంజాబ్ నూత‌న సీఎంగా భ‌గ‌వంత్ ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ స్వ‌యంగా హాజ‌రైన ఈ వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ వేడుక ముగిసిన కాసేప‌టికే భ‌గ‌వంత్‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ప్ర‌ధాని ట్వీట్ చేయ‌డం విశేషం. పంజాబ్ అభివృద్దికి, రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమానికి క‌లిసి ప‌నిచేద్దామ‌ని ఈ సంద‌ర్భంగా భ‌గ‌వంత్‌కు మోడీ సూచించారు. కేంద్రం నుంచి పంజాబ్‌కు స‌హ‌కారం ల‌భిస్తుంద‌ని మోడీ తెలిపారు. ఈ సంద‌ర్భంగా మోడీ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement