Sunday, April 28, 2024

కాంగ్రెస్ అభినందనలు.. ఆరోగ్య‌క‌ర‌మైన పోటీతో ముందుకెళ్దాం.. కేటీఆర్

క‌ర్ణాట‌క‌లో నూత‌నంగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి శుభాభినంద‌న‌లు తెలిపారు మంత్రి కేటీఆర్.దరిద్రగొట్టు విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కేటీఆర్ వెల్లడించారు. అయితే, కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో చూశామని, అదే విధంగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ ప్రభావంపై చూపుతాయని అనుకోవడంలేదని అభిప్రాయపడ్డారు. భారతదేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్, బెంగళూరు నగరాలను మరింత ఎత్తుకు ఎదగనిద్దామని, ఆరోగ్యకరమైన పోటీతో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనలో ఇంకా ముందుకు వెళ్లేలా తోడ్పాటు అందిద్దామని పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement