Monday, April 29, 2024

కర్ణాటకలో ప్రేమతో విజయం సాధించాం.. రాహుల్ గాంధీ

కర్ణాటక రాష్ట్రంలో ప్రేమతో విజయం సాధించామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో సాధించిన విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. కర్ణాటక ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ద్వేషంతో చేసే రాజకీయాలు ముగిశాయని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ద్వేషం మార్కెట్ మూసివేయబడింది.. ప్రేమ దుకాణాలు తెరవబడ్డాయని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో పేద ప్రజల తరుపున పోరాడామని, పేదల శక్తి విజయం సాధించిందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పునారావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలో తాము చేసిన 5 హామీలను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. కర్ణాటకలోని ప్రజలు క్రోనీ కాపిటలిస్టులను ఓడించారని, ఈ పోరాటంలో తాము ద్వేషంతో పోరాడలేదని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement