Thursday, May 2, 2024

సినీ ప‌రిశ్ర‌మ‌లోని కార్మికుల పిల్ల‌ల‌కు యూనివ‌ర్శిటీ ఫీజుల్లో రాయితీ – మోహ‌న్ బాబు

టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లోని 24క్రాప్ట్స్ కు చెందిన కార్మికుల పిల్ల‌ల‌కు మోహ‌న్ బాబు యూనివ‌ర్శిటీలో ఫీజుల్లో రాయితీ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా మాట్లాడారు. సినీ కళామతల్లి తనకు ఎంతో ఇచ్చిందని… అలాంటి పరిశ్రమకు ఉడతా భక్తిగా ఏదైనా చేయాలనే ఆలోచన తనకు వచ్చిందని మోహన్ బాబు తెలిపారు. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ లో పని చేస్తున్న వారి పిల్లలు తమ యూనివర్శిటీలో చదువుకోవాలనుకుంటే ఫీజులో రాయితీ ఇస్తానని ప్రకటించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 1992లో శ్రీ విద్యానికేతన్ ను ప్రారంభించామని మోహన్ బాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని కొందరు పిల్లలకు, ఇండస్ట్రీకి చెందిన మరి కొంతమంది పిల్లలకు… కులమతాలకు అతీతంగా 25 శాతం మందికి విద్యానికేతన్ లో ఉచితంగా విద్యను అందిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలన్నీ ‘మోహన్ బాబు’ యూనివర్శిటీగా మారాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement