Saturday, May 18, 2024

Hyderabad: ఆల్విన్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జగద్గిరి గుట్ట, ఆల్విన్ కాలనీలోని అన్నపూర్ణ ఎలక్ట్రానిక్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారిపై ప్రమాదం సంభవించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement