Sunday, April 28, 2024

మూడో వంతు పంట న‌ష్ట‌పోతేనే ప‌రిహారం….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: దాదాపు పద్దెనిమిది జిల్లాల్లో వ్యవసాయ రంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించిన అకాల వర్షాలు, వడగండ్లు రైతాంగాన్ని కోలుకోలేని విధంగా చేశా యిి. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చడానికి మార్గం తోచని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, వారికి ఆశా భంగం తప్పదన్న సంకేతాలు, అందుకు అనుగుణంగా వాస్తవ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారుల సర్వేలు, నివేదికలన్నీ పాత జీవో ప్రకారమే జరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ”అకాల వర్షాలకు నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం. ఎక రాినికి రూ.10 వేలు చొప్పున అందజేస్తాం. త్వరలోనే నిధు లు విడుదల చేస్తాం, కౌలు రైతులు సాగు చేసిన చోట వారికే పరి హారం ఇస్తాం” అంటూ ఇటీవల అన్ని జిల్లాల్లో అధికారులు ప్రకటించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన తర్వాత ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే.

కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన స్థాయిలో నష్టపోయిన రైతులందరికీ పరిహారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టం సర్వేకు వస్తున్న అగ్రికల్చర్‌ ఆఫీసర్లు 33శాతం పంట పాడైతేనే పరిగణనలోకి తీసుకుంటు న్నారు. కోసి, ఎండబెట్టిన పంటకు పరిహారం అందదని, మిర్చి సాగు కాలం పూర్తి కావడంతో దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇప్పటివరకున్న జీవో ప్రకారం నిబంధనలు అత్యంత కటినతరంగా ఉన్నాయి. కమతాల వారీగా రైతు సాగు చేసిన విస్తీర్ణంలో 33శాతం పంట నష్టపోతేనే పరిహారం పొందేందు కు రైతులు అర్హత కలిగి వుంటారు. ఆ మార్గదర్శకాల మేరకే అధికారులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. జీవోను పునరు ద్ధరిస్తే తప్ప బాధిత రైతులందరికీ న్యాయం జరిగే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో పంట నష్టం మూడోవంతు దాటని లక్షలాది మంది రైతుల్లో ఆందో ళన కనిపిస్తోంది. చివరకు మక్కజొన్న తప్పించి వరి, మిర్చి, మామిడి సహా చాలా పంటలకు ప్రభుత్వం అందించే పరి హారం వర్తిస్తుందా లేదా అని బాధిత రైతులు ఆందోళన చెందు తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత మూడు వారాలు కావస్తున్నా ఎలాంటి సాయం చేతికందకపో వడంతో ఇంకెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

కొన్ని పంటలకే పరిహారం
ఫీల్డ్‌ సర్వేలో పాల్గొంటున్న అధికారులు చెబుతున్న నిబంధనల ప్రకారం కొన్ని పంటలకే పరిహారం అందే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కేవలం మొక్కజొన్న, వరి మాత్రమే పంట నష్టం సర్వే లెక్కల్లోకి వస్తోంది. మార్చి రెండో వారం వరకు మిర్చి రెండు కోతలు పూర్తవుతాయనే భావనలో ఉన్న ఆఫీసర్లు, పైకి కొన్ని జిల్లాల్లో సర్వే చేస్తున్నారు. కోతలు పూర్తయిన కమతాలకు పరిహారం పైసలిచ్చేలా కనిపించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మామిడి, మిర్చి, వరి పంట లకు సంబంధించి ఆఫీసర్లు సర్వే చేశారు. వరికి పొట్ట దశలో కాకుండా, గింజ దశలో ఉండి.. గింజలు రాలితేనే పరిహారం వస్తుందని చెబుతున్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మొక్కజొన్న, వరి, కర్బూజ, పుచ్చకాయ పంటలను ఆఫీసర్లు సర్వే చేశారు. సిద్దిపేట జిల్లాలో సన్‌ప్లnవర్‌, మొక్కజొన్నకు మాత్రం పరిహారం అందే అవకాశం ఉంది. వరి, మామిడి రైతులకు రూల్స్‌ ప్రకారం పైసలు వచ్చే చాన్స్‌ లేదు. నాగర్‌ కర్నూలు జిల్లాలో మామిడి, సంగారెడ్డిలో మామిడి, మక్క, టమాట రైతులకు మాత్రమే పరిహారం అందే అవకాశం కనిపి స్తోంది. అదికూడా మూడోవంతు పంట నష్టం జరిగిన రైతుల్లో నిబంధనల ప్రకారం జాబితాల్లో ఉన్నవాళ్లు సరాసరిగా 10 శాతం మాత్రమే ఉంటున్నారు. ఇక 33శాతం లోపు నష్టం జరి గినా రైతులు ఆశలు వదులుకోక తప్పని పరిస్ధితులున్నాయి.

కఠిన నిబంధనలు.. అధికారుల నిర్లక్ష్యపు విధులు
పంట నష్టం అంచనా కోసం నిర్వహంచే సర్వేకు సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది. ఎకరం పొలంలో 33శాతం కంటే ఎక్కువ పంట పాడైతేనే నష్టం కింద పరిగణనలోకి తీసుకుం టారు. కోసిన పంట డ్యామేజ్‌ అయినా లెక్కలోకి రాదు. ఇప్పుడు మిర్చి విషయంలో ఇదే జరుగుతోంది. చాలా వరకు రైతులు కాయలు కోసి కల్లాల్లో ఆరబెట్టారు. ఇవి తడిసి పోయినా నష్టం కిందకు రాదని గైడ్‌లైన్స్‌ చెబుతున్నాయి. సాధారణంగా మార్చి నెలాఖరుకే మిరప పంట పూర్త వుతుంది. కానీ, ఈసారి వరదల వల్ల నెల రోజులు ఆలస్యంగా మొదలైంది. ఏప్రిల్‌ నెలాఖరు వరకు మిరపకాయల కోతలు జరుగుతూనే ఉంటాయి. ఇవేమీ పట్టించుకోకుండా అధికా రులు ఇష్టారాజ్యంగా జాబితాలు రూపొందిస్తున్నారు.

మూడేళ్ల నుంచి ఒక్కసారే అందిన పరిహారం
మూడేళ్ల కిందట ఒకసారి పంట నీట మునిగిన తర్వాత అధికారులు వచ్చి నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ.19 వేల పరిహారంగా నిర్ణయించి ఇచ్చారు. తర్వాత నష్టపోయిన పంట లకు రూపాయి కూడా ఇవ్వలేరు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకాన్ని అమలు చేస్తే కనీసం రైతులకు కొంతమేరైనా లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement