Monday, May 6, 2024

Alert: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. మరో 3 రోజుల పాటు చలిగాలులు!

తెలుగు రాష్ట్రాలపై చలిపంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి వణికిస్తోంది. ఈశాన్య దిశ నుంచి శీతలగాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయింది.

తెలంగాణలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో నారాయణపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

ఏపీలోని విశాఖ ఏజెన్సీలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. విశాఖ, లంబసింగిలో కనిష్ట ఉష్టోగ్రత 10 డిగ్రీలకు నమోదవుతున్నాయి. చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మంచు విపరీతంగా కురుస్తుండడంతో గిరిజనులు రోజు వారీ కార్యక్రమాలు చేసుకోడానికి ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు వల్ల ఉదయం 9 గంటలు దాటితే గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement