Saturday, May 4, 2024

క‌డుపులో రూ.9కోట్ల విలువైన కొకైన్-వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

తొమ్మిది కోట్ల విలువైన కొకైన్ ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న లైబిరియాకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన అజర్ బైజాన్ నుండి అడిస్ అబాబా మీదుగా ఆ ప్రయాణీకుడు ఢిల్లీకి చేరుకున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగులు చెక్ చేశారు. కానీ ఏమీ లభ్యం కాలేదు. కొన్ని క్యాప్యూల్స్ రూపంలో డ్రగ్స్ ను తరలిస్తున్న విషయాన్ని అతను కస్టమ్స్ అధికారులకు తెలిపారు. దీంతో అతడి పొట్ట నుండి 599 గ్రాముల వైట్ పౌడర్ ఉన్న క్యాప్యూల్స్ ను రికవరీ చేశారు. దీన్ని కొకైన్ గా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీని విలువ రూ. 9 కోట్లుగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశామని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement