Wednesday, May 15, 2024

చ‌ర్చిలో కాల్పులు – ఒక‌రు మృతి-ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

అల‌బామాలోన ఓచ‌ర్చిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు..కాగా మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బర్మింగ్‌హామ్ సబర్బ్‌ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.అమెరికాలో తుపాకుల మోతకు తెరపడడం లేదు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement