Wednesday, May 15, 2024

సీజేఐ జస్టిస్ బోబ్డే వీడ్కోలు

సీజేఐ జస్టిస్ బోబ్డే వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న తదుపరి సీజేఐ జస్టిస్ ఎ.రమణ – సీజేఐ జస్టిస్ బోబ్డేతో అనుబంధాన్ని మరచిపోలేనన్నారు. జస్టిస్ బోబ్డే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఆకట్టుకున్నాయని అన్నారు. సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వర్చువల్‌గా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. జస్టిస్‌ బోబ్డేలోని తెలివి, శక్తి సామర్థ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. దేశమంతా ప్రస్తుతం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో కొన్ని బలమైన చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలని సూచించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణతోనే మహమ్మారిని ఓడించగలమని చెప్పారు.

”భారత సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నా వంతు కృషి చేశాను చీఫ్ జస్టిస్ బోబ్డే. ఇప్పుడు పరిపూర్ణ సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నాను. జడ్జిగా 21 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. ఆనందం, సద్భావన నాకు బాగా ఇష్టమైన జ్ఞాపకాలు. గతంలో చాలా సార్లు సెర్మోనియల్ బెంచ్ లో సభ్యుడగా ఉన్నాను కానీ చివరి రోజున నాలో మిశ్రమ భావాలున్నందున విషయాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నా..” అంటూ భావోద్వేగానికి గురయ్యారు చీఫ్ జస్టిస్ బోబ్డే.

Advertisement

తాజా వార్తలు

Advertisement