Wednesday, May 15, 2024

BRS vs Congress – ప‌వ‌ర్ పాలిటిక్స్ …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

తెలంగాణ రాజకీయాలు ఉచిత విద్యుత్‌ అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఉచిత విద్యుత్‌ అంశంపై అధికార, విపక్ష పార్టీల నడుమ రగిలిన ‘కరెంట్‌ వార్‌’ అసెంబ్లి ఎన్నికల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుని ఎన్నికల బరిలో దిగేందుకు అధికార పార్టీ భారాస భారీ వ్యూ#హం సిద్ధం చేసుకునే పనిలో ఉండగా ప్రభుత్వం చెబుతున్న 24 గంటల విద్యుత్‌ సరఫరా పచ్చి బూటకమని నిరూపించేందుకు రైతులతో కలిసి విద్యుత్‌ సబ్‌స్టేషన్లను సందర్శించి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ పటిష్ట ప్రణాళికను రూపొందించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ రంగానికి మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తే చాలునని, 24 గంటల అనవసరమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. భారాస వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ సైతం భారీ కార్యా చరణ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 1999 సంవత్సరంలోనే కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని నిర్ణయించి ఎన్నికల ప్రణాళికలో చేర్చిందన్న విషయాన్ని గ్రామ గ్రామానికి వెళ్లి ప్రచారం చేయాలని ప్రతి గ్రామంలో రచ్చబండ సమావేశాలను నిర్వ#హంచి అధికార పార్టీని తూర్పారబట్టాలని కాంగ్రెస్‌ ముఖ్యలు ప్రతిపాదించినట్టు సమాచారం.

సబ్‌స్టేషన్ల బాటపట్టి వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్‌ సరఫరా పచ్చిబూటకమని తేల్చేందుకు కూడా సమాయత్తమవుతున్నట్టు సమాచారం. మొత్తం మీద విద్యుత్‌ అంశం రెండు రాజకీయ పార్టీల నడుమ అగ్గిని రాజేసినట్లయ్యింది. విద్యుత్‌ అంశాన్ని అధికార పార్టీ భారాస, విపక్ష పార్టీ కాంగ్రెస్‌ ‘తగ్గేదే లే’ అన్న రీతిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలు, ప్రతిదూషణలు చేసుకుంటుండంతో తెలంగాణ పాలిటిక్స్‌ మరింత #హటెక్కాయి. పవర్‌ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని పవర్‌లోకి రావాలని కాంగ్రెస్‌.. అదే పవర్‌ మంటలతో కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్‌ఎస్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. ఇటు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌.. అటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే భారాస కార్యనిర్వా#హక అధ్యక్షుడు, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్‌ రద్దవుతుందంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతన్నలకు మూడు గంటల విద్యుత్‌ చాలన్న కాంగ్రెస్‌ విధానంపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలని, ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో ఆయన శనివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వ#హంచారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రకటనను ప్రజలకు వివరించాలని కేటీఆర్‌ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ధరణి సమస్యపై ప్రజల్లోకి కాంగ్రెస్‌
ఉచిత విద్యుత్‌ అంశాన్ని రాజకీయంగా వాడుకుని వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో లబ్ది పొందేందుకు భారాస వ్యూ#హం రచిస్తుండగా ధరణి పోర్టల్‌ వల్ల రైతులు, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అగచాట్లపై ప్రజల్లోకి వెళ్లి పోరాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైనట్టు సమాచారం. ఉచిత విద్యుత్‌ సరఫరాపై కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రకటనపై ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు రైతు సమావేశాలు నిర్వ#హంచాలని కేటీఆర్‌ పిలుపునివ్వగా ఆరోజు నుంచే విద్యుత్‌ సబ్‌స్టేషన్లను రైతులతో కలిసి సందర్శించి ప్రభుత్వం 24 గంటలపాటు విద్యుత్‌ను ఇస్తున్నానని చెప్పి 9 గంటలు కూడా ఇవ్వడం లేదన్న అసలు సంగతిని బయటపెట్టాలని నిర్ణయించింది. రైతులు, కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘం కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వ#హంచాలని భావిస్తోంది. ప్రతి సబ్‌స్టేషన్‌ రైతు వేదిక వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు బైఠాయించి ఆందోళన నిర్వ#హంచాలని, 24 గంటల విద్యుత్‌ సరఫరాకు పట్టుబట్టాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా కాంగ్రెస్‌ విధానమన్న విషయం స్పష్టం చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అన్నదాతలకు అండ.. కాంగ్రెస్‌ జెండా! అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కోరనుంది. సబ్‌స్టేషన్ల సందర్శన సందర్బంగా లాగ్‌ పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్న డిమాండ్‌ను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేయనున్నారు.

కేసీఆర్‌ పాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబుతో అంటకాగి బషీర్‌బాగ్‌ కాల్పల ఘటనకు ఇప్పటి సీఎం కేసీఆర్‌ కారణమయ్యారన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన తర్వాత కూడా 9 నెలల పాటు కేసీఆర్‌ తెలుగుదేశంలోనే ఉన్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందుంచి చర్చనీయాంశం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement