Tuesday, April 30, 2024

కారు టాప్ గేర్ – అభ్య‌ర్దుల ప్ర‌క‌ట‌న‌లో బిఆర్ఎస్ ముందంజ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: వివాదాలు లేని, పోటీ- అంతంత మాత్రంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసి వారి పేర్లను ప్రకటించాలన్న నిర్ణయానికి భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత సీఎం కేసీఆర్‌ వచ్చారా? అంటే అవుననే అంటు-న్నాయి పార్టీ వర్గాలు. ఈనిర్ణయంలో భాగంగానే పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీ- రామారావు ఆయా నియోజక వర్గాల పర్యటనకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టే నేతల పేర్లు ప్రకటిస్తు న్నట్టు- సమాచారం. ఇందులో భాగంగానే ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు- శుక్రవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బహి రంగ సభలో కేటీఆర్‌ ప్రకటించారు హుజూరా బాద్‌, భూపాలపల్లి, వరంగల్‌ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్లకు పాడి కౌశిక్‌ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, దాస్యం వినయ భాస్కర్‌ పేర్లను కూడా కేటీ-ఆర్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా రానున్న రెండు మూడు నెలల్లో మరో నలభై మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

రాజుకుంటు-న్న అసెంబ్లీ ఎన్నికల వేడి!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజు కుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి మరో నాలుగైదు మాసాల సమయ మున్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నిలబెట్టే అభ్య ర్థుల ఎంపికపై కసరత్తు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అధికార పార్టీ భారాస ఒకడుగు ముందుకేసి వివాదాలు లేని అసెంబ్లీ, లోక్‌సభ నియోజక వర్గాల్లో పోటీ-కి నిలబెట్టే అభ్యర్థుల పేర్లను ప్రకటించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో తామే బరిలోకి దిగుతున్నామని పార్టీ అధినాయకత్వం అభ్యర్థిత్వంపై పచ్చజెండా ఊపిందని ఇక ఎన్నికల ప్రచారం చేసుకొమ్మని ఆదే శించిందని భారాస సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కొందరు తమతమ నియోజకవర్గాల్లో టికెట్లు- తమకే అంటూ స్వయం ప్రకటనలు సుకుంటు-ండం వివాదాలకు దారితీస్తున్నాయి. దీంతో నియోజక వర్గాల్లో నాలుగైదు గ్రూపులు ఏర్పడి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతుండడం పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా తయారైంది.

మూడు అసెంబ్లీ నియోజక అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేటీ-ఆర్‌
రాష్ట్రంలోని ఆయా అసెంబ్లీ, లోక్‌సభ సెగ్మెంట్లలలో విస్తృతంగా పర్యటిస్తూ పభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటు-న్న భారాస కార్యనిర్వాహక అధక్షుడు, ఐటీ,- పరిశ్రమల శాఖ మంత్రి కేటీ- రామారావు ఎన్నికల్లో పోటీ-కి పెట్టే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నెలలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో పర్యటించిన సందర్భంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి పెట్టేది కౌశిక్‌ రెడ్డినేనని ప్రకటించారు. ఈ-టల రాజేందర్‌ రాజీనామా చేశాక జరిగిన ఉప ఎన్నికలో భారాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు ముందే కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న పాడి కౌశిక్‌ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి భారాస తీర్థం పుచుకున్నాడు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కౌశిక్‌కు ఎమ్మెల్సీ పదవి వరించడం… శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ కావడం జరిగిపోయాయి. కాగా హుజురాబాద్‌ నుంచి కౌశిక్‌ను ఖరారు చేస్తున్నట్టు- కేటీ-ఆర్‌ ప్రకటించి గెలిపించుకునే బాధ్యత ప్రజలదేనని చెప్పారు.

తాజాగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలో పర్యటించిన కేటీ-ఆర్‌ కరీంనగర్‌ లోక్‌సభతో పాటు- వరంగల్‌ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థుల పేర్లను ప్రకటించి పార్టీ శ్రేణులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్‌ లోక్‌సభకు మాజీ ఎంపీ, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ పోటీ- చేస్తారని హుస్నాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రకటించారు.

- Advertisement -

కాగా వరంగల్‌ పశ్చిమ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేదాస్యం వినయ భాస్కర్‌ మళ్లి బరిలో ఉంటారని, ఆయన పేరును ప్రకటించారు. నెల రోజుల క్రితం భూపాలపల్లిలో పర్యటించిన కేటీ-ఆర్‌ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో గండ్ర కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు భారాసలో చేరిన సమయంలో గండ్ర గులాబీ కండువా కప్పుకున్నారు.

స్వయం ప్రకటితులు వీరే..
అసెంబ్లీ ఎన్నికల్లో తామే అభ్యర్థులమని ఎన్నికల ప్రచారం చేపట్టాలని పార్టీ పెద్దలు కోరారని పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు స్వయంగా ప్రకటించుకోవడం పార్టీలో నియోజక వర్గంలో తీవ్ర గందరగోళానికి గొడవలకు దారితీశాయన్న ప్రచారం జరుగుతోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ-చేస్తున్నానని గెలుపూ తనదేనని రెండు రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు- చేసి ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌, తాండూర్‌కు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తదితరులు అసెంబ్లీ బరిలో తామే ఉంటు-న్నామని ప్రకటించుకున్నారు.
కాంగ్రెస్‌లోనూ అదే తీరు
అధికార భారాసలోనే కాదు కాంగ్రెస్‌ పార్టీలోనూ స్వయం ప్రకటిత అభ్యర్థులు దండిగానే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. పీసీసీ మాజీ చీఫ్‌, నల్గొండ ఎంపీ కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్‌, తన సతీమణి పద్మావతి కోదాడ నుంచి బరిలో దిగనున్నామని ప్రకటించారు. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ-కి దిగుతున్నానని ప్రకటించుకున్నారు. నిరుద్యోగ పోరాటంలో భాగంగా ఇటీ-వల నల్గొండ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌తో పాటు- వెంకట్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆరునూరైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ-కి దిగుతున్నానని రేవంత్‌ తన ఇంటికి బి.ఫారం పంపించాలని కోరారు.

అసెంబ్లీ సీజన్‌ వచ్చినట్టే..
అసెంబ్లీ ఎన్నికల సీజన్‌ దాదాపు వచ్చేసినట్లే నన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పార్టీల అధినేతలు వరుస సమావేశాలు, బహిరంగ సభలతో బిజిబిజీగా గడుపుతున్నారు. మరోవైపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు- చేసి ఎన్నికలకు ఎలా ప్లాన్‌ చేసుకోవాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల విషయంలో ఒక అడుగు ముందుకేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్లు- విషయంలో క్లారిటీ- స్పష్టత ఇస్తూనే పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సిట్టింగుల్లో మొదలైన దడ
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీ- రామారావు ఆయా జిల్లాలు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుండగా తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. సమయం, అవకాశం దొరికినప్పుడల్లా అధినేత కేసీఆర్‌ యువనేత కేటీ-ఆర్‌లను కలిసినా వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో సిట్టింగ్‌లలో గుబులు మొదలైనట్టు- సమాచారం. సిట్టింగ్‌లందరికీ మళ్ళీ పోటీ- చేసే అవకాశం కల్పిస్తానని పార్టీ కీలక సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ భరోసా ఇస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్టు- సమాచారం. టికెట్‌ విషయంలో గట్టిగా అడిగి ఏదో ఒకటి తేల్చుకుందామని అనుకున్నా అలా ప్రశ్నించే అవకాశం లేదని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement