Friday, May 3, 2024

దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు

ఆధ్యాత్మిక రంగంలో గురు శిష్య సంబంధాలు విలక్షణమైనవి. సద్గురువు లభిం చడం చాలా దుర్లభం. సద్గురువు ఆయన శిష్యకోటిలో ఒకని గా అంగీకరించడం ఆ శిష్యుని అదృష్టం.
వాత్సల్యంతో చేరదీసి, మంచి మార్గాన్ని చూపి, మార్గదర్శకత్వాన్ని నెరపుతూ, అవసరమైనప్పుడు తన చేయూతను అందించేవాడే సద్గురువు. కొందరు గురువులు అత్యంత ప్రసన్నులై శిష్యులకు మార్గ దర్శ నం చేస్తే, మరికొందరు అడుగడుగునా శిష్యులను పరీ క్షలకు గురిచేస్తూ జ్ఞానమార్గంలోకి నడుపుతూ ఉంటా రు. ఎవరి బోధనా విధానం వారిది. ఒక్క సారి ప్రియశి ష్యునిగా స్వీకరించాక ఎటువంటి పరిస్థితులలోనూ అతనిని వదలక తనంతవానిగా తీర్చిదిద్దడానికి సద్గు రువు అహరహమూ శ్రమిస్తూ ఉంటాడు. అందుకు ఉదాహరణ ఋభ, నిదాఘుల వృత్తాంతం.
ఋభుడు బ్రహ్మ మానస పుత్రుడు. పుట్టుకతోనే బ్ర#హ్మజ్ఞాన సంపన్నుడతడు. అతనికి పులస్త్య ప్రజాపతి కొడుకైన నిదాఘుడు అనే ప్రియశిష్యుడు ఉండేవాడు. గురుకృపతో నిదాఘుడు అశేషమైన విజ్ఞానాన్ని సంపా దించాడు. విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తన తండ్రి పులస్త్య బ్ర#హ్మచే నిర్మితమైన సుందర, సుసంపన్నమైన వీరనగరం అనే పట్టణంలో గార్హ్యస్థ జీవితం గడుపు తూ, ధార్మిక ప్రవృత్తితో జీవించసాగాడు. ఇది కృత యుగం నాటిమాట ఆ కాలంలో మానవులు వేల సంవ త్సరాలు జీవించేవారట. అలా ఒక వెయ్యి సంవత్సరా లు గడచిపోయాయి. ఒకమారు ఋభునికి తన ప్రియ శిష్యుడైన నిదాఘుడు తన బోధన వలన కలిగిన విజ్ఞా నాన్ని ఎలా వినియోగించుకొంటున్నాడో చూడాలని పించింది. వీరనగరం చేరి నిదాఘుని ఇంటికి వెళ్ళాడు. చాలాకాలం గడిచిపోయింది కనుక నిదాఘుడు తన గురువును పోల్చుకోలేక పోయాడు.
ఇంటికి వచ్చిన ఋభునిని అతిథిగా భావించి, గౌరవంగా ఆహ్వానించి, అర్ఘ్యపాద్యాలు సమర్పించి, ఉచితాసనం మీద కుర్చోబెట్టి, ఆతిథ్యం తన ఇంట స్వీక రించమని ప్రార్థించాడు నిదాఘుడు. ”మీ ఇంట నాకు తినడానికి ఏమున్నది?” అని అడిగిన ఋభునికి ”పేల పిండి, కందమూలాదులతో చేసిన అప్పం వంటి పదా ర్థాలు…” అని నిదాఘుడు చెబుతూ ఉండగానే, ”ఇటు వంటివి నేనిష్టపడను. మంచి నేతితో వండిన మధుర పదార్థాలు, గారెలు, గట్టి పెరుగు వంటివి లేవా” అన్నా డు ఋభుడు. అతని ధాష్ణీకానికి విసుక్కోకుండా నిదా ఘుడు భార్యతో రుచికరమైన వంట చేయించి అతిథికి భోజనం అమర్చాడు. భోజనానంతరం విశ్రమిస్తున్న ఋభుని వద్దకు వచ్చి ”మహాత్మా! తమకు మా ఇంటి భోజనం సంతృప్తిని కలిగించిందా?” అని అడిగాడు. దానికి ఋభుడు తాను నిత్య సంతృప్తుడననీ, రుచి అరుచులు; మృష్టామృష్టతలు, సుఖదు:ఖాలు తనకు చెందవు అనీ చెప్పి, ఆత్మజ్ఞానం గురించి లోతుగా వివ రించాడు. అప్పుడు నిదాఘుడు ఆ అతిథి తన గురువైన ఋభుడే అన్న ఎరుక కలుగగా, తనకు ఆత్మజ్ఞానాన్ని బోధింపవచ్చిన ఆయన శిష్యవాత్సల్యానికి కరిగిపో యాడు. కాలక్రమంలో మరో వెయ్యి సంవత్సరాలు గడిచి పోయాయి. తాను బోధించిన ఆత్మజ్ఞానం శిష్యు నిలో ఎంత పరిపక్వ స్థితికి వచ్చిందో తెలుసుకోడానికి ఋభుడు మరలా వీర నగరానికి వచ్చాడు. అప్పుడు ఆ నగరంలో మహారాజు పట్టపుటేనుగు మీద కూర్చొని ఊరేగుతున్నాడు. తన ఇంటికి కావలసిన వంటచెరకు ను అడవిలో సేకరించి తీసుకొనివెడుతున్న నిదాఘుడు ఆ కోలాహలం సద్దుమణిగే దాకా రహదారి ప్రక్కన ఆగి ఉన్నాడు. ఒక అమాయకుడైన పల్లెటూరివానిలా గా అతని దగ్గరకు పోయి ఋభుడు ”ఏమిటి ఆ కోలా హలం” అని అడిగాడు. ”మహారాజు ఏనుగు అంబారీ పై ఊరేగుతున్నారు చూడు” అని బదులిచ్చాడు నిదా ఘుడు. ”అవునా! ఈ మందలో మహారాజెవరు?” అన్నాడు ఋభుడు. ”అదిగో! ఆ ఏనుగుపైన ఉన్నవా డు రాజు” అని సమాధానమిచ్చాడు నిదాఘుడు ”అ య్యో, నాకు అన్ని ఆకారాలు ఒకటిగానే కనిపిస్తున్నా యి. అందులో రాజెవరు? ఏనుగు ఎవరు?” అని అడి గాడు ఋభుడు మళ్ళీ. నిదాఘుడు ఎంతో ఓపికతో ”పైన కూర్చున్నవాడు రాజు. అతనికింద ఉన్నది ఏను గు” అంటూ వేలితో చూపాడు. ”సరిసరి. తెలిసిందిలే. కానీ పైన, క్రింద అంటే ఏమిటి?” అని మళ్ళీ ఋభుడు అడిగేసరికి చిర్రెత్తి ఋభుని మెడవంచి, అతనిపైకి లం ఘించి కూర్చుని ”నేనున్నది నీపైన, నీవున్నది నా కిం ద” అన్నాడు నిదాఘుడు. ”బాగుంది. పైన, క్రిం ద అం టే తెలిసింది. కానీ, ‘నేను’ ‘నీవు’ అన్నావే. అంటే ఏమి టి?” అని ఋభుడు అనగానే, తనను ఇంతవరకు ప్రశ్ని స్తున్నది తన గురువేనని అర్థమై ఆయన పాదాలపై పడి పోయాడు నిదాఘుడు. అతనికి అద్వైతాన్ని బోధించి వెళ్ళిపోయాడు ఋభుడు. విష్ణుపురాణంలోని ఈ గురుశిష్యుల గాథను భగవాన్‌ శ్రీరమణ మహర్షి తన శిష్యులకు చెప్పగా విని ఆ విషయాన్ని కె.లక్ష్మణ శర్మ ‘మహాయోగ’ అనే ఆంగ్ల గ్రంథంలో పేర్కొన్నారు.
షిరిడీ సాయిబాబా కూడా గురు శిష్యుల సంబం ధం గురించి తమ శిష్యులతో ఇలా చెప్పి ఉన్నారు. ”తల్లితాబేలు నదికి ఒక ఒడ్డున ఉండగా దాని పిల్ల లు ఇంకొక ఒడ్డున ఉంటాయి. తల్లి ఆ పిల్లలకు పాలు ఇవ్వడం, పొదగడం వంటివేమీ చేయదు. తల్లి తాబేలు తన కంటి చూపు మాత్రంతో పిల్లలకు జీవ శక్తి చేరవేస్తుంది. పిల్ల తాబేళ్ళు తమ తల్లిని చూస్తూ సదా జ్ఞాపకం ఉంచుకొంటూ ఉంటయి. తల్లి తాబే లు చూపు పిల్లలకు అమృతధార వలె పనిచేస్తుంది. అదే వాటి బ్రతుకుకు ఆధారమవుతుంది. గురు శిష్యుల సంబంధం ఇటువంటిదే”. మౌనంగానే శిష్యుల సందేహాలను నివృత్తి చేయగలిగిన శ్రీ రమ ణ మహ ర్షి, సాయిబాబా మొదలైనవారు సాక్షాత్‌ శ్రీ దక్షిణా మూర్తి స్వరూపులే.
అర్హతలేని గురువువల్ల ఆశ్రయం ఇచ్చినవారు, పొందినవారు ఇద్దరూ భ్రష్టులవుతారు అనే విషయా న్ని శ్రీ రామకృష్ణ పరమహంస, తనకు ఎదురైన ఒక సంఘటన ద్వారా, శిష్యు లకు బోధించారు. ”ఒకరోజు నేను (కలకత్తాలోని దక్షిణశ్వరంలో) పంచవటి వైపు వెడుతున్నాను. ఇంతలో సమీపంలోని ఒక సరుగుడు తోపులోనుండి ఒక కప్ప దీనంగా అరవడం వినిపించిం ది. నేను పట్టించుకోకుండా పంచవటిలో ఒకచోట కూ ర్చుని ధ్యానం చేసుకొన్నాను. అది పూర్తయి తిరిగి వస్తు న్నప్పుడు కూడా ఆ కప్ప అలాగే దీనంగా అరుస్తుండ డము విని ఏమిటా అని దగ్గరకు వెళ్ళి చూశాను. ఒక బలహనమైన నీటిపామొకటి ఆ కప్పను నోట కరచు కొని ఉంది. అది సన్నటి నీటి పాము కావడంతో కప్పను మింగలేకపోతోంది. అలా అని వదలకుండానూ ఉంది. అదే ఏ నాగుపాము నోటనో పడి ఉంటే ఈపాటికి ఆ కప్ప సులువుగా ఈ దేహాన్ని వదిలి మరొక జన్మకూడా ఎత్తి ఉండేది. సద్గురువు కాని వ్యక్తి చేతిలో పడిన శిష్యుల పరి స్థితీ ఇలాగే ఉంటుంది” అని వివరించారు ఆయన. ఉపనిషత్తులు ఇలా చెప్పాయి. భర్తలేని భార్య బ్రతుకు, తల్లిలేని శిశువు బ్రతుకు, గురువులేని (సామాన్య) నరు ల బ్రతుకు నిరర్థకం అని అర్థం. కనుక సద్గురువు లభిం చాలని కోరుకొంటూ ఆధ్యాత్మక సాధన కొనసాగిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement